పవన్ కళ్యాణ్ ఇటీవల హీరోలు ఎక్కువగా స్మగ్లర్ల పాత్రలు చేస్తున్నారని కామెంట్ చేయడం ... వెంటనే బన్నీ ఏదైనా నాకు నచ్చితే వస్తా ... నచ్చితే చేస్తాను అనటం ఆ వెంటనే ఈ వివాదంలోకి బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి దూరి పవన్ ఎత్తిచూపుతూ కామెంట్లు చేయటం ... దీనిపై సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ డిబేట్లు ఇవన్నీ చూస్తే బన్నీ - పవన్ మధ్య వార్ ముదిరినట్టుగా కనిపించాయి. ఈ వ్యవహారం ముదరడంతో చివరకు మెగా ఫ్యాన్స్ వేరు ... అల్లు ఆర్మీ వేరు అన్న చర్చకు దారితీసింది.
ఇది రోజురోజుకు పెరిగి పెద్దది కావడంతో .. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే బన్నీకి కాల్ చేశారని ... దీనిపై లేనిపోని రాద్ధాంతం చేయవద్దని సూచించారని త్వరలోనే చిరంజీవి - పవన్ కళ్యాణ్ - బన్నీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. మరి చిరంజీవితో అయినా బన్నీ వర్సెస్ పవన్ మధ్య వార్ కు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.