భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా విడాకులు తీసుకున్న విషయం సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రోజుల నుంచి నటాషా హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అటు నటాషా గానీ ఇటు హార్దిక్ పాండ్యా కానీ స్పందించింది లేదు. కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం వీరి విడాకుల గురించి గుసగుసలు ఆడుతూనే ఉన్నారు.


 ఇక అటు టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో కూడా అందరి ఆటగాళ్ల కుటుంబ సభ్యులు వచ్చి టీమిండియా ప్లేయర్స్ అందరితో కూడా సంతోషమైన క్షణాలను పంచుకుంటే హార్దిక్ పాండ్యా భార్య నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇక వీరి విడాకుల వార్తలు నిజమే అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచి రోజులు కూడా గడవలేదు. అప్పుడే హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇంకోవైపు నటాషా కూడా ఇలాంటి ప్రకటన చేసింది. ఆ తర్వాత తన కొడుకు అగస్త్యతో సెర్బియా వెళ్ళిపోయింది నటాషా.


 దీంతో వీరిద్దరి గురించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన.. అది వైరల్ గా మారిపోతుంది. ఇటీవల భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడిపోయిన నటాషా అంతకుముందు నటుడు మోడల్ అయినా అలీ గోనితో డేటింగ్ చేసింది అన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి  మధ్య బ్రేకప్ జరగడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని ఇటీవలే గోని వెల్లడించాడు. నటాషా నా కుటుంబంతో ఉండేందుకు ఇష్టపడలేదు. వేరుగా వద్దామని నాతో చెప్పింది  కానీ నేను నా కుటుంబాన్ని వదిలేందుకు ఇష్టపడలేదు. అందుకే నటాషా నాకు బ్రేకప్ చెప్పేసింది అంటూ అలీ గోని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో నటాషా - గోని ఒక డాన్స్ షోలో కలిసి పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: