రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది కల్కి 2898ఏడి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. అదే స్పీడ్ తో తన చిత్రాలను చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, SKN నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ హార్రర్ కామెడీ డ్రామాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం పై

 ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలావుండగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న హారర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రాజాసాబ్‌’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలైలో విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ప్రభాస్‌ రొమాంటిక్‌ లుక్స్‌తో ఫిదా చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ బయటికొచ్చింది. ప్రభాస్‌ జన్మదినమైన అక్టోబర్‌ 23న టీజర్‌ను విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం 'రాజాసాబ్‌’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది.

 ప్రభాస్‌ తన షూటింగ్‌ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేశారు. తాజా షెడ్యూల్‌లో ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ కీలక షెడ్యూల్ లో ప్రభాస్ తన పార్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగతా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇతర నటీనటులు పాల్గొంటున్నారు.. ఇక ఇటీవల కల్కి సినిమాతో భారీ విషాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎటువంటి విషయాన్ని అందుకుంటాడా అని ఎంతో ఆసక్తిని ఎదురు చూస్తున్నారు సినీ ఆడియన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: