సాధారణంగా స్టార్ హీరోలకు సంబంధించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అది తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు స్టార్ హీరో అజిత్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న అజిత్ అటు ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు తనకు ఎంతో ఇష్టమైన బైక్ కార్ రేసింగ్ లలో పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా బైక్ కార్ రేసింగ్ లలో పాల్గొనడం అజిత్ కు పిచ్చి.. అందుకే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పణంగా పెట్టి మరి ఇలాంటి రేసింగ్ లు చేయడం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇలా రేసింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండే అజిత్ మార్కెట్లోకి ఎలాంటి కొత్త రేసింగ్ వాహనం లాంచ్ అయినా కూడా ఆ వాహనాన్ని తీసుకునేందుకు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ స్టార్ హీరో ఏకంగా 234 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఏంటి 234 కిలోమీటర్ల వేగంతో కారు నడపడమా.. అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మాత్రం ఇది ఎంతో సునాయాసంగా చేసి చూపించాడు. తాజాగా తన ఆడి కారులో బయటకు వెళ్లిన అజిత్ కుమార్ 234 కిలోమీటర్ల వేగంతో కారును నడిపిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. హైవేపై క్రమంగా 230 కిలోమీటర్ల వేగానికి తన కారు చేరుకునే వీడియోని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు   ఇది విదేశాల్లో జరిగినట్లు తెలుస్తోంది.  అయితే పర్సనల్ లైఫ్ లోనే కాదు సినిమాల్లోనూ కొన్ని చేజింగ్ సీన్లలో అజిత్ స్వయంగా వేగంగా కారు నడిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: