స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ‘దేవర 1’ విడుదలకు ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అందుకే, టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా కీలక పాత్రల్లో

 నటిస్తున్నారు. మరోవైపు ‘దేవర పార్ట్ 1’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీజర్ తో పాటు రెండు సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసారు. అయితే ఆ రెండు పాటల్లో డాన్స్ పెద్దగా కనిపించలేదు. ఎన్టీఆర్ సినిమాలోని పాటలు అంటే అభిమానులు ఓ రేంజ్ డాన్స్ స్టెప్పులను ఆశిస్తారు. పైగా నాటు నాటు సాంగ్ తో డాన్స్ విషయంలో ఎన్టీఆర్ ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. మరి ఆ పాపులారిటీని మ్యాచ్ చేయాలంటే.. దేవరలో అంతకుమించి డాన్స్ స్టెప్పులు ఉండాలి. అయితే ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు పాటల్లో అలంటి స్టెప్పులు లేకపోవడంతో

ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. కానీ తరువాత వచ్చే పాటల్లో మాత్రం ఎన్టీఆర్ డ్యాన్స్ ఓ లెవెల్ లో ఉంటుందని సమాచారం. సినిమాలో రెండు డాన్స్ నెంబర్ పాటలు ఉన్నాయంట. ఆ పాటల్లో ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోతుందని చెబుతున్నారు. తరువాత రిలీజ్ కాబోయే మూడో లిరికల్ పాటలో.. ఆ సూపర్ డాన్స్ స్టెప్పులను చూపించబోతున్నారని ఫిలిం వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: