తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్దీ మంది హీరోయిన్లలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆకాష్ పోరి హీరోగా రూపొందిన రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ సినిమాలో ఈమె మాత్రం తన అందాలను విపరీతంగా ఆరబోసింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు కూడా దక్కాయి. 

ఇకపోతే ఇప్పటి వరకు ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈమె నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోలేదు. కాకపోతే ఈమె సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ బ్యూటీ కి వరుసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా కూడా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా కేతిక చీర కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన కురులను విరబోసుకొని సైడ్ అండ్ ఫ్రంట్ వ్యూ లో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కేతికా కు సంబంధించిన ఈ చీరకట్టు లో ఉన్న ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇలా కేతిక సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: