కెరియర్ మొదట్లో హీరో నాగార్జున చేసిన సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోగా రాణిస్తూ ఉన్నారు. ఈ రోజున నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా రాంగోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన శివ సినిమా నాగార్జున కెరీర్ ని మార్చేసింది. అప్పట్లో సైకిల్ చైన్ సిన్ ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటుంది. 1959లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ట్రెండు ని శ్రీకారం చుట్టేలా చేసింది. అప్పటివరకు కమర్షియల్ చిత్రాలలో నటించిన నాగార్జున భారీ డైలాగులు వంటివి లేకపోయినా టెక్నికల్ గా ప్రయోగం చేయాలనుకున్న డైరెక్టర్ వర్మకు అవకాశం ఇవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి ఏకంగా మూడు నంది అవార్డులు వచ్చాయి.


శివ తర్వాత నాగార్జున క్రేజ్ పూర్తిగా మారిపోయింది. గోవిందా గోవిందా, నిన్నే పెళ్ళాడుతా ,హలో బ్రదర్ వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో కూడా అలరించారు. ఆ తర్వాత నాగార్జున అన్నమయ్య సినిమాతో సరికొత్త కొత్తదనాన్ని పరిచయం చేశారు. మాస్ ఆడియన్స్ కు అగ్ర నటుడైన నాగార్జున ఆధ్యాత్మిక సినిమా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

ముఖ్యంగా నాగార్జున రిస్కు చేయడంలో ఎలాంటి వెనుకడుగు వేయరు.. సుమారుగా 40 మంది దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేశారు నాగార్జున. అందులో రాంగోపాల్ వర్మ, రాఘవ లారెన్స్, వైవిఎస్ చౌదరి, విజయ్ బిన్నీ తదితర డైరెక్టర్లు ఉన్నారు. నాగార్జున నిర్మించిన యువ అనే సీరియల్ లో కూడా కనిపించారట.


బిగ్బాస్ హోస్టుగా కూడా బుల్లితెర పైన మంచి క్రేజీ సంపాదించుకున్నారు నాగార్జున. ఇప్పటివరకు బిగ్ బాస్-3,4,5,6,7 షోలకు పోస్టుగా వ్యవహరించారు 8వ సీజన్ కి కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి కూడా హోస్టు గానే కనిపించారు.


అభిమానులు నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని పిలుస్తూ ఉంటారు. నాగార్జున ఎప్పుడూ కూడా వర్కౌట్ చేస్తూ తనకు ప్రశాంతంగా ఉండడానికి వ్యాయామం చేస్తూ ఉంటారట. అందువల్లే తను అందంగా కనిపిస్తూ ఉంటానని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర సినిమాల నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: