అల్లు అర్జున్ కి తండ్రి అల్లు అరవింద్ అంటే ఎంత గౌరవమో చెప్పనక్కర్లేదు. ఓ ఈవెంట్ లో తన గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని బన్నీ ఎమోషనల్ అయినా సంగతి మనకు తెలిసిందే.  ఇక తన తండ్రి లేకపోతే నేనులేను అంటూ  ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే అలాంటి అల్లు అర్జున్ గతంలో తన తండ్రిని అవమానించినందుకు ఓ స్టార్ డైరెక్టర్ తో గొడవ పడ్డారట. ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారట.మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు అల్లు అరవింద్ ని ఆయన అవమానించారు అనేది చూద్దాం.. అల్లు అరవింద్ కోసం అల్లు అర్జున్ పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో అప్పట్లో గొడవ పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి. రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర మూవీకి నిర్మాతగా అల్లు అరవింద్ చేశారు.అయితే ఈ సినిమాని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో తీద్దామని రాజమౌళి అన్నారట. కానీ బడ్జెట్ ఎక్కువవుతుందని, సినిమాని హిట్ టాక్ అన్ని భాషల్లో రాకపోతే బడ్జెట్ మీద పడుతుంది అని వద్దన్నారట. 

ఇక అక్కడ ఇద్దరి మధ్య కాస్త దూరం ఏర్పడింది. ఆ తర్వాత సినిమాకి వచ్చిన బడ్జెట్ ని పోస్టర్లో వేయకూడదు అని ముందుగానే రాజమౌళి, అల్లు అరవింద్ లు అనుకున్నారట.కానీ ఆ తర్వాత సినిమా విడుదలయ్యాక అభిమానుల రిక్వెస్ట్ మేరకు ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ పోస్టర్ వేశారట.ఈ విషయంలో రాజమౌళి అల్లు అరవింద్ కి ఫోన్ చేసి మరీ ఎందుకిలా చేశారని కాస్త కఠినంగా మాట్లాడి అవమానించారట. కానీ ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ రాజమౌళి ఇంటికి వెళ్లి మరీ అభిమానులు బలవంతం చేస్తే మా నాన్న ను ఏం చేయమంటారు అంటూ గట్టిగా మాట్లాడారట.అలా అల్లు అర్జున్ కి రాజమౌళికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందట.

అందుకే అప్పటినుండి రాజమౌళి అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.ఇక రాజమౌళి ఎంతోమంది ఇప్పటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు తీస్తూ ఉంటే కేవలం అల్లుఅర్జున్ ని మాత్రం పక్కన పెట్టేశారు.కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి దర్శకత్వంలో చేయకుండానే సుకుమార్ తో పుష్ప సినిమా చేసి రాజమౌళి లేకుండానే పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే రాజమౌళి అల్లు అర్జున్ లు గొడవ పెట్టుకున్నారు అనేది ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టిన ఒక రూమర్ మాత్రమేనని తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ ఎన్నో ఈవెంట్లలో నవ్వుతూ మాట్లాడుకున్న వీడియోలు ఫోటోలు కనిపిస్తాయి

మరింత సమాచారం తెలుసుకోండి: