బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ మారిన ప్రభాస్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ప్రభాస్ కూ అస్సలు కలిసి రాలేదు. ఏ సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తూనే వచ్చింది అన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన సాహో బాలీవుడ్లో పరవాలేదు అనిపించిన.. తెలుగులో మాత్రం హిట్ కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కూడా అభిమానులను మెప్పించలేకపోయింది.


 అయితే ఈ రెండు ఫ్లాప్ సినిమాలు తర్వాత అటు భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వసూళ్ల పరంగా పరవాలేదు అనిపించిన మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రామాయణాన్ని కించపరిచే విధంగా ఈ సినిమాను ఓం రౌత్ తెరకెక్కించాడు అంటూ విమర్శలు గుప్పించారు ఎంతోమంది.


 దీంతో ప్రభాస్ కెరియర్లో ఆది పురుష్ మూవీ కేవలం ఒక ఫ్లాప్ మూవీ గానే మిగిలిపోయింది అని చెప్పాలి. అలాంటి మూవీ గురించి ఇటీవల డైరెక్టర్ ఓం రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆది పురుష్ డిజాస్టర్ అంటూ కొందరు చేసిన ట్రోల్స్ పై  స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కావాలని కొందరు చేస్తున్న ట్రోల్స్ ని పట్టించుకోవాల్సిన పనిలేదు. ఓ సినిమాకు కావాల్సింది బాక్సాఫీస్ విజయం. ఆది పురుష్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే 73 కోట్ల వసూళ్లు రాగా.. మొత్తంగా 400 కోట్ల వస్తువులు సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల వసూళ్లు వచ్చాయి అంటూ ఓంరౌత్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: