సినిమా ఇండస్ట్రీలోనైనా సరే అభిమానులు లేనిదే హీరోలు లేరనే విషయం ఎన్నోసార్లు ప్రూఫ్ చేశారు. ముఖ్యంగా కొత్త సినిమా రిలీజ్ అయింది అంటే చాలు టికెట్ల రేట్లు పెంచినప్పటికీ కూడా చొక్కాలు చింపుకొని మరి సినిమాలు చూడడానికి అభిమానులు వెళుతూ ఉంటారు. అయితే అభిమానులు కోటీశ్వరులుగా ఉన్నారు లేదో తెలియదు కానీ సినిమాల ద్వారా హీరో హీరోయిన్స్ మాత్రం భారీగానే సంపాదించారు.. అలా భారతదేశంలోని రిచెస్ట్ హీరోల లిస్టు గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఆస్తులు 7,300 కోట్ల రూపాయలు.. సినిమాలను నటించడమే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలు, యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో భారీగానే సంపాదిస్తారు.


జుహ్లి చావ్లా: సినిమాలు, వ్యాపారం క్రికెట్లో పెట్టుబడిల వల్ల ఈమె ఆస్తి సుమారుగా 4,600 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.


హృతిక్ రోషన్: సినిమాలు, యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఈయన ఆస్తి సుమారుగా 2000 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది

అమితాబచ్చన్: సినిమాలు ,యాడ్స్, బుల్లితెర పైన పలు రకాల శూల ద్వారా భారీగానే సంపాదిస్తున్నారు అలాగే రియల్ ఎస్టేట్ వాటిలో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్నారు అమితాబచ్చన్ ఈయన ఆస్తి సుమారుగా 1600 కోట్ల రూపాయలు.

కరణ్ జోహార్: దర్శకుడిగా నిర్మాతగా మంచి పేరు సంపాదించారు. ఈయన ఆస్తి సుమారుగా 1400 కోట్ల రూపాయలు ఉన్నది.. టీవీ షోలు, యాడ్స్ ,సినిమాల డిస్ట్రిబ్యూషన్, ప్రొడ్యూసర్  వల్ల భారీగానే సంపాదిస్తున్నారు.


ఇక వేరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాతో పాటు స్పోర్ట్స్ రంగాలలో కూడా చాలామంది పెట్టుబడులు పెట్టి భారీ గానే సంపాదిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ కూడా వీరు అధికారికంగా ప్రకటించినటువంటి ఆస్తులేనట. ప్రభుత్వానికి కూడా తెలిపిన విలువ ప్రకారమే ఇది ఉన్నది. మార్కెట్ ప్రకారం లెక్క వేస్తే ఎంతుంటుందో ఊహకే అందుకోలెం

మరింత సమాచారం తెలుసుకోండి: