ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజుల ట్రెండ్ అయితే ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టిన రోజులకు పలు సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. కొత్త సినిమాలు ఎలా రిలీజ్ అయితే అభిమానులు హంగామా చేస్తున్నారు. అలాగే రీ రిలీజ్ లో సినిమాల విషయంలో కూడా అంతే హంగామా చేస్తూ నిర్మాతలకు కాసుల వర్షాలను కురిపిస్తున్నారు. ఒక హీరోని చూసి మరొక హీరో రీ రిలీజ్ చిత్రాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. రీసెంట్గా చిరంజీవి నటించిన ఇంద్ర 4k లో రిలీజ్ చేశారు.



ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అలాగే ఇంద్ర సినిమా 22 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలైన కూడా అంతే హంగామా థియేటర్లో కనిపిస్తోంది. ఇంద్ర సినిమా 2.44 కోట్ల రూపాయలు రాబట్టింది. అయితే ఈ రోజున నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన మాస్ సినిమాని 4k లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని కొరియోగ్రాఫర్ గా లారెన్స్ డైరెక్షన్ వహించారు. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లారెన్స్ నాగార్జునకు మంచి విజయాన్ని అందించారు.


ఇందులో రఘువరన్, రాహుల్ దేవ్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అప్పట్లోనే ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాదులో 63% ఆక్యుపెన్సి తో థియేటర్లు బుక్ అయ్యాయని తెలుస్తోంది. అలాగే కర్ణాటక ఇతరత్ర ప్రాంతాలలో కూడా భారీగానే కలెక్షన్స్ సాధించాయి.. మొత్తం మీద ఇండియా వైస్ గా నాగార్జున నటించిన మాస్ సినిమా 12.6 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో చూసుకుంటే నాగార్జున కాస్త వెనుక పడ్డారని చెప్పవచ్చు.. మరి ఫుల్ రిపోర్టు బాక్సాఫీస్ వద్ద లెక్క ఏమని వస్తుందో రేపటి రోజున తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: