బాలకృష్ణ చిన్న వయసులోనే ఎన్టీఆర్ సినిమా తాతమ్మ కల అనే చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాని ఎన్టీఆర్ నిర్మిస్తూ డైరెక్షన్ చేశారట. 1974లో ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదలకు ముందే చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సెన్సార్ ఇవ్వకుండా కూడా ఇవ్వలేదట. అలాగే రెండు నెలలు బ్యాన్ విధించారట. బాలకృష్ణ మొదటి సినిమాకు చాలా కష్టాలు వచ్చాయని తెలుస్తోంది. తాతమ్మ కల సినిమా విడుదల సమయంలో దేశంలోని కుటుంబ నియంత్రణ కోసం ఒక పాలసీని తీసుకువచ్చారట అప్పటి ప్రభుత్వం.
ఇద్దరు ముద్దు ఆపై వద్దు అని ప్రచారం కూడా చేయడం జరిగింది.. కానీ ఈ సినిమాలో అందుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ చూపించారు. ఎంతమంది పిల్లలు ఉండాలి అనేది అది తల్లితండ్రుల ఇష్టమని గవర్నమెంట్ ఇష్టం కాదన్నట్లుగా ఎన్టీఆర్ చెప్పేవారట.దీంతో అందుకు తగ్గట్టుగా పాయింట్ను కూడా ఈ సినిమాలో తీసుకురావడంతో అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే చివరికి ఎన్టీఆర్ అసెంబ్లీలో సైతం ఈ సినిమా గురించి పోరాడి విడుదల చేయగలిగారు. అలా ఎన్టీఆర్ తాతమ్మకల సినిమా 1974 ఆగస్టు 30న విడుదల అయింది. అలా బాలయ్య కెమెరా ముందుకి వచ్చిన మొదటి సినిమాకు 50 ఏళ్లు ఇప్పుడు పూర్తి అయింది.