తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ దర్శకులలో ఒకరు అయినటువంటి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో నాని కి జోడి గా నటించింది. నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జే సూర్య  ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిన్న అనగా ఆగస్టు 29 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి పెద్ద మొత్తంలోనే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్లు సమాచారం.

ఇకపోతే ఈ మూవీ కి ఓ టి టి హక్కుల ద్వారా కూడా పెద్ద మొత్తం లోనే డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టి టి సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: