లోకనాయకుడు కమల్ హాసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సినిమాలను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడు ఆయనకు అభిమానే. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కెరియర్ లో పోషించిన పాత్రలు అలాంటివి. యాక్టింగ్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా కొనసాగే కమల్ హాసన్.. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి నట విశ్వరూపం చూపించారు. ఓకే సినిమాలో విభిన్నమైన పాత్రలు పోషించి అన్ని పాత్రలకు న్యాయం చేయడంలో ఆయన దిట్ట అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటిపోతున్న సమయంలో కూడా ఇలాంటి డిఫరెంట్ రూల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అందుకే యాక్టింగ్ లో కమల్ హాసన్ రేంజ్ వేరు అని డైరెక్టర్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో అలాంటి డిఫరెంట్ రోల్స్ చేస్తూ కమలహాసన్ ను గుర్తుచేసే నటుడు ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు తెరమీదకి వస్తూనే ఉంటుంది. అయితే ఆ నటుడు ఎవరో కాదు శ్రీ విష్ణు అంటూ ఇటీవల యంగ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. హీరో శ్రీ విష్ణు అందరిలా కమర్షియల్ సినిమాల వెంట పడకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.


 ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు స్వాగ్ అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ద్విపాత్రాభినయం కాదు ఏకంగా మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ ఈవెంట్లో డైరెక్టర్ హర్షిత్ గోలి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు స్కోప్ ఉండి ఉంటే కమల్ హాసన్ తో స్వాగ్ మూవీ చేసే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు. తెలుగులో శ్రీ విష్ణుని మించిన కమల్ హాసన్ తనకు కనబడలేదని కామెంట్ చేశాడు. స్వాగ్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీ విష్ణు యాక్టింగ్ దిమ్మ తిరిగి పోతుందని చెప్పుకొచ్చాడు. కాగా గతంలో హసిథ్, శ్రీ విష్ణు కాంబినేషన్లో రాజరాజ చోర అనే మూవీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: