బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు వినిపిస్తే చాలు అక్కడే కాంట్రవర్శీలు వినిపిస్తుంటాయి. నార్త్‌లో ఈ బ్యూటీ మాట అంటే చాలా మందికి భగ్గుమంటుంది. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా కంగనా చెప్పడంతో ఆమెకు విరోదులు ఎక్కువ మందే ఉన్నారని చెప్పాలి. సెలబ్రిటీలపైనే కాకుండా పొలిటీషియన్స్‌పై కూడా కంగనా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఏ విషయం అయినా సరే అందులో కంగనా ఇన్వాల్వ్ అయితే చాలు ఇక అది నేషనల్ లెవల్ న్యూస్ అయిపోతుందంతే.

తాజాగా కంగనా రనౌత్ ఎమర్జెన్సీ అనే మూవీ చేస్తోంది. ఈ మూవీపైనే ఇప్పుడు సమస్య స్టార్ట్ అయ్యింది. దీంతో సమస్య నాలో ఉందా? వారిలో ఉందా? అంటూ కంగనా మరో కాంట్రవర్శీకి వెల్‌కమ్ చెప్పింది. తన వరకూ తాను మంచి వ్యక్తినని చెబుతూనే మరో సందేహాన్ని వ్యక్తి చేసింది. ఇండస్ట్రీ నుంచి తనకు ఎంతో సపోర్ట్ ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నవారితో మర్యాదపూర్వకంగానే ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం ఎందుకు సమస్యగా ఉందో తెలియడం లేదని కంగనా చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరోలు సల్మాన్‌, షారుఖ్‌, ఆమీర్‌‌లతో మూవీ చేస్తే అందులో హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉండదని చెబుతూ మొన్నటి వరకూ ఫైర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు తన మూవీపై భగ్గుమంటోంది.

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో పీఆర్‌ల రాజ్యం నడుస్తోందని, ఎవరిలోనైనా టాలెంట్ కనిపిస్తే వారిని తొక్కేయడానికి చూస్తారని కంగనా చెప్పుకొచ్చింది. ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ 6వ తేదిన రిలీజ్ కానుంది. ఈ టైంలో కంగనా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఎమర్జెన్సీ మూవీకి సంబంధించి తనకు బెదిరింపులు ఎదురయ్యాయని, తనను ఆపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. ఏదేమైనా తాను తీసిన సినిమాను విడుదల చేసే వరకూ ఆగనని చెప్పుకొచ్చింది ఈ ఫైర్ బ్రాండ్. ప్రస్తుతం కంగనా పరిస్థితిపై, ఎమర్జెన్సీ సినిమాపై నెటిజన్లు నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నారు. అయ్యయ్యో..కంగన రనౌత్‌కు ఇలా అవుతోందేంటి? అంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: