సినిమా కైనా రన్ టైమ్ అనేది కీలక పాత్రను పోషిస్తూ ఉంటుంది. సినిమాలో కంటెంట్ ఉండి సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉన్న పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ సినిమా కథలో బలం లేకపోయినా ఏదో సినిమా రన్ టైమ్ ను పెంచాలి అనే ఉద్దేశంతో సినిమాను పొడిగించినట్లు అయితే ఆ సినిమా రన్ టైమే ఆ మూవీ కి మైనస్ గా మారుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు భారీ రన్ టైమ్ తో విడుదల కావడం , విడుదల అయిన తర్వాత ఆ సినిమా రన్ టైమ్ ఆ మూవీ కి మైనస్ అని టాక్ రావడంతో సినిమా రన్ టైమ్ ను తగ్గించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ రన్ టైమ్ ఎక్కువగా ఉంది. అదే ఈ మూవీ కి మైనస్ అనే టాక్ రావడంతో వెంటనే ఈ మూవీ బృందం ఈ సినిమా రన్  టైమ్ ను కాస్త తగ్గించింది. ఇక రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ దాదాపుగా 2 గంటల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువ అయింది అనే టాక్ రావడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా రన్ టైమ్ ను కూడా ఆ తర్వాత తగ్గించింది.

ఇకపోతే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కూడా భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ రన్ టైమ్ ఈ మూవీ కి మైనస్ అనే టాక్ రావడంతో ఈ మూవీ బృందం కూడా ఆ తర్వాత ఈ సినిమా రన్ టైమ్ ను తగ్గించింది. ఇలా ఈ మధ్య కాలంలోనే రవితేజ నటించిన రెండు సినిమాలకు విడుదల తర్వాత రన్ టైమ్ ను తగ్గిస్తే , కమల్ హాసన్ నటించిన ఒక సినిమాకు విడుదల తర్వాత రన్ టైమ్ ను తగ్గించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: