సెప్టెంబరు 1న నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. తెలుగు చిత్రసీమ మొత్తం ఏకమై ఈ కార్యక్నమం నిర్వహించబోతోంది.ఓ మహానటుడి లెగస్సీ నెత్తిమీద ఉంచుకొని, నట వారసుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి, అభిమానుల అంచనాల్ని తట్టుకొంటూ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ప్రయాణం చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ భారం నందమూరి బాలకృష్ణ మోశారు. ఆ అంచనాల్ని తట్టుకొన్నారు. నందమూరి అభిమానుల్ని మెప్పిస్తూనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాని సృష్టించుకొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా చిత్రసీమని అలరిస్తూనే ఉన్నారు. ఇది అపూర్వమైన ప్రయాణం. అనితర సాధ్యమైన ప్రభంజనం. మరో వందేళ్లు గుర్తు పెట్టుకొనే చారిత్రక ఘట్టం.నందమూరి తారక రామారావుని ఇలవేల్పులా ఆరాధించిన తెలుగు ప్రజానీకం. ఆయన వారసుడ్ని అంతకంటే ఎత్తులో చూడాలనుకొంటుంది. ఎన్టీఆర్‌ పౌరాణికాలు చేశారు. జానపదాల్లో మెరిశారు. సోషల్ కథల గురించి ఇహ చెప్పక్కర్లెద్దు. చారిత్రక పాత్రలెన్నో ఆయన ముందు మోకరిల్లాయి. ఇంతకంటే బాలయ్య ఏం చేయగలడు? అంతకంటే ఏం మెప్పించగలడు? అనేదే అందరి ప్రశ్న. వాటిని మెల్లమెల్లగా పటాపంచలు చేసుకొంటూ వెళ్లాడు బాలయ్య. తొలి అడుగుల్లో కమర్షియల్ కథలపైనే మొగ్గు చూపినా, ఆ తరవాత క్రమక్రమంగా విశ్వరూపం చూపించుకొంటూ ముందుకు వెళ్లాడు.ఓసారి కథ ఒప్పుకొంటే - దర్శకుడి విషయంలో వేలు పెట్టని ప్రొఫెషనలిజం బాలయ్యకే సొంతం. ఓ సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడ్ని నిందించడం, హిట్ అయితే ఆ క్రిడిట్ అంతా తానే తీసుకోవడం బాలయ్య కెరీర్‌లో ఎప్పుడూ జరగలేదు. బాలయ్య అంత భోళా మనిషి ఇంకెక్కడా కనిపించడు కూడా. ఆ లక్షణంతోనే తన అభిమానగణాన్ని మరింత పెంచుకొంటూ వెళ్లారు. అన్ స్టాపబుల్‌ షోలో కనిపించిన బాలయ్య వ్యక్తిత్వం, మాటకారితనం ఆయనపై ప్రేమని మరింత పెంచేశాయి. ఇది ఆయనలో కనిపించిన మరో యాంగిల్‌.

ఇక నేటితో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా పరిశ్రమ తరఫున ప్రముఖులంతా కూడా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుతున్నారు.ఈ కార్యక్రమం హైదరాబాదులో ఎల్లుండి అనగా సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు , రేవంత్ రెడ్డి తో పాటు ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ , అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ కూడా ఆహ్వానం అందింది. అంతే కాదు శివ రాజ్ కుమార్, మమ్ముట్టి , మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు.ఇక మెగా కుటుంబంలోని సభ్యులు అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇలా చాలామంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు . మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీని మొదలుకొని బాలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తెలుగు నుంచి దాదాపు హీరోలంతా ఈ వేడుకలో పాలు పంచుకోనున్నారు. ముఖ్యంగా యువ హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్దు జొన్నలగడ్డ, కార్తికేయ ఇలా దాదాపు 10మంది హీరోలు బాలయ్య కోసం స్టెప్పులు వేయబోతున్నారు. కొన్ని కామెడీ స్కిట్లు కూడా ప్లాన్ చేశారు. అందుకోసం ఈ హీరోలంతా రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.

చిరంజీవి, అల్లు అర్జున్‌, వెంకటేష్ తదితర కథానాయకులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. నాగార్జున కూడా ఇదే వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. అయితే సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు. కాబట్టి రావడం వీలు కావడం లేదని తెలుస్తోంది. తమిళ చిత్రసీమ నుంచి విజయ్‌సేతుపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళం నుంచి ఇద్దరు ముగ్గురు హీరోలు, హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ఆదివారం ఏఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారన్న విషయం ఈరోజు సాయింత్రానికల్లా అధికారికంగా ప్రకటిస్తారు.కానీ సొంత ఇంటి కుటుంబ సభ్యులైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లను మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు అని తెలుస్తోంది. నిజానికి మొదట్లో తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ , ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ ఎన్టీఆర్కు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.2009 ఎన్నికల తర్వాత పార్టీకి దూరం జరిగారు ఎన్టీఆర్. అయితే దీనికి కూడా కారణం లేకపోలేదు 2009 ఎన్నికలలో జోరుగా ప్రచారం నిర్వహించిన ఎన్టీఆర్ ను టిడిపి దూరం పెట్టింది. పైగా వైయస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించలేదు. అంతేకాదు ఆయన అనుచరులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే వారిని నియంత్రించే ప్రయత్నం చేయలేదు.దీంతో ఎన్టీఆర్ పైన వ్యతిరేకత ఏర్పడింది. మరొకవైపు కళ్యాణ్ రామ్ కు ఆర్థిక సమస్యలు అన్నింటిని ఎన్టీఆర్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాట కళ్యాణ్ రామ్ జవదాటడం లేదు. అందుకే అందరికీ ఆహ్వానం అందిస్తున్నా.. వీరిద్దరికి ఆహ్వానం మాత్రం అందలేదు అని తెలుస్తోంది. మరి వీరికి ఆహ్వానం అందిందా లేదా అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: