హీరో నాని, ఎస్ జె సూర్య , ప్రియాంక మోహన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం సరిపోదా శనివారం.. ఈ చిత్రం నిన్నటి రోజున గ్రాండ్గా థియేటర్లో విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించారు. వీరి కాంబినేషన్లో ఇది రెండవ సినిమా ఆట. డివిడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో వచ్చినప్పటికీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మరి కలెక్షన్స్ ఏవిధంగా వచ్చాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.



సరిపోదా శనివారం సినిమా దసరా సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలుస్తోంది. దసరా సినిమా మొదటి రోజు 38 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ సరిపోదా శనివారం సినిమా కలెక్షన్స్ సంబంధించి అనౌన్స్మెంట్ చేయకపోయినా సినీ ట్రెండ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేవలం రూ.20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో రూ.9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అలాగే ఇండియాలోని మిగిలిన ప్రాంతాలలో రూ .4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్.. ఓవర్సీస్ లో 7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.


మరి ఈ వీకెండ్ కలిసి వచ్చి ఈ సినిమా కలెక్షన్స్ పెరిగితే తప్ప రూ .100 కోట్లను రీచ్ అయ్యే అవకాశం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి నాని నటించిన గత చిత్రం దసరా రూ .110 కోట్లు రాబట్టగా హాయ్ నాన్న చిత్రం రూ .75 కోట్లకు రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.. మరి సరిపోదా శనివారం సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి. ఇందులో నాని నటన అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు బోరింగుగా అనిపిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఎస్ జె సూర్య అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: