హీరో నానికి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అందులోనూ దసరా, హాయ్ నాన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ పడటంతో సరిపోదా శనివారంపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి తగ్గట్లే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగానే ప్రమోట్ చేశారు నాని. ముఖ్యంగా ముంబై, కొచ్చి, బెంగళూరు, చెన్నైలలో నాని ప్రమోషన్లు గట్టిగా చేశారు. అక్కడి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్‌కి కూడా బాగా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇక ఈ సినిమా టాక్ విషయానికొస్తే ఆడియన్స్ నుంచి పాజిటివ్ అభిప్రాయమే వస్తుంది. సినిమాలో నాని యాక్షన్ సీక్వెన్సులు బావున్నాయని, ఎస్‌జే సూర్య యాక్టింగ్ కూడా ఇరగదీశారంటూ చెబుతున్నారు.

అయితే సినిమాలో తరువాత ఏం జరగబోతుంది అనేది తెలిసిపోవడం కాస్త మైనస్ అంటున్నారు. ఓవరాల్‌గా సినిమా అయితే ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఇక జేక్స్ బేజాయ్ ఇచ్చిన మ్యూజిక్, బీజీఎమ్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. అంటే సుందరానికి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో వివేక్‌ ఆత్రేయ నాని కోసం పుష్కలంగా యాక్షన్‌ ఏపిపోడ్స్‌ చిత్రీకరించాడు. అంతేకాదు కొంత మందికి ఇది మితిమీరిన హింసలా కనిపించింది. అయితే ఈ సినిమాలో లాజిక్‌లను దర్శకుడు వివేక్‌ పెద్దగా పట్టించుకోలేదు.

 సినిమాలో హైదరాబాద్‌లోనే సోకులపాలెం అనే ఒక ఏరియా వున్నట్లుగా క్రియేట్‌చేసి.. ఆ ఏరియాలో ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో.. చేతకాని వాళ్లుగా.. ఒక సిఐ చేతులో ఆ ఏరియా ప్రజలు నలిగిపోతున్నట్లుగా చూపించాడు. అంతేకాదు అక్కడి ప్రజలను ఒక రాజు తరహాలో సిఐ హింసిస్తున్నట్లుగా చూపించడం సహజత్వానికి చాలా దూరంగా వుంది. ఎందుకంటే కథ కూడా ప్రజెంట్‌ టైమ్‌లో నడుస్తున్నట్లుగానే చూపిస్తూ.. ఇంకా ఈ రోజుల్లో హైదరాబాద్‌ లాంటి ఏరియాలో అలాంటి అకృత్యాలు జరుగుతున్నాయని చూపించడం నిజంగా రియల్‌స్టిక్‌గా లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: