ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా అనౌన్స్ చేశారు. కొరటాల ఆచారి లాంటి డిజాస్టర్ అందించి ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సహజంగానే అందరి ఆసక్తి ఉంది. దానికి తగ్గట్టుగానే హీరోయిన్గా అతిలోకసుందరి అని తెలుగు వారంతా భావించే జాన్వీ కపూర్ ను దించడం, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం అని చెప్పడం విలన్ గా, సైఫ్ అలీ ఖాన్ ను దింపడం లాంటివి సినిమా మీద ఉన్న ఆసక్తిని అమాంతంగా పెంచేశాయి.దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఒక రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కేశాయి. మూడో పాట కోసం ఇప్పుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తనవంతుగా తాను హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరొకపక్క మీడియాకి, సోషల్ మీడియా కి లీకులు ఇస్తూ సినిమా యూనిట్ కూడా సినిమా మీద హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ హైప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే పెద్దగా హైప్ లేకుండా వచ్చిన సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంత నెగిటివ్ టాక్ ఉన్నా సింహభాగం పాజిటివ్ టాక్ తో హిట్ ట్యాగ్ వేసుకొని దూసుకుపోతోంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఒక తెలివైన పని చేశారు. హైప్ లేకుండా వచ్చి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. నానికి ఎన్టీఆర్ కి పోలిక పెట్టలేము కానీ నాని సినిమా రిజల్ట్ చూశాక దాదాపుగా ఇప్పుడు దేవరకి కూడా హైప్ కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే హైప్ ఎంత పెరిగితే దర్శక నిర్మాతలకు అంత కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఏర్పడుతోంది.
ఏమాత్రం అంచనాలకు తగ్గినా సినిమా ఏమీ బాలేదని సోషల్ మీడియాలో అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఈ హైప్ ని ఇంకా ఇంకా పెంచే బదులు కాస్త తగ్గించి ప్రేక్షకుల్లోకి వదిలితే మంచిదేమో అనే భావన సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే సినిమా కొంచెం బాగున్నా భలే ఉందే అనే ఫీలింగ్ కలుగుతుంది అదే భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లి సినిమా పర్వాలేదు అనిపించుకునేలా ఉన్నా ఇదేం బాగుంది అనే ఫీలింగ్ కలగడం సర్వ సాధారణం. కాబట్టి ఈ విషయంలో దేవర టీం సరిపోదా శనివారం టీం స్ట్రాటజీని ఫాలో అయితే కొంత సేఫ్ సైడ్ ఉండవచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదిలావుండగా అక్టోబర్ నెల నుంచి తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.తారక్ వార్2 షూటింగ్ ఎంతవరకు పూర్తైందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.