నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న సంగతి తెలసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయ్యింది. అలాగే  ఆయన చేయాల్సిన లైనప్ కూడా భారీగానే ఉంది. గతేడాది హాయ్ నాన్న సినిమాతో నాని సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో , సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‍తో నానిమూవీ చేయాల్సి ఉంది. అయితే, నాని - సుజీత్  సినిమా ప్రారంభం కాకముందే సందిగ్ధంలో పడింది. మరి ఈ సినిమ ఏం చేస్తాడు అన్నది నాని చేతిలోనే ఉంది.

ఇదిలవుండగా మాస్, క్లాస్ టచ్ ఏదైనా కూడా తనదైన శైలిలో పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తూ అందరికి చేరువ అయ్యాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా నాని ఇమేజ్ పెరుగుతోంది. దానికి తగ్గట్లుగానే నాని రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ ఉండటం విశేషం.  వరుస సక్సెస్ లు అందుకుంటూ టైర్ 2 హీరోల జాబితాలోకి వచ్చేసాడు. 2017లో చేసిన నేను లోకల్ సినిమాకి ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ నాని అందుకున్నాడు.  కరోనా కాలంలో 15 కోట్లలో ఉన్న నాని రెమ్యునరేషన్ ఈ నాలుగేళ్లలో 10 కోట్లు పెరిగి ఏకంగా 25 కోట్లకి చేరుకుంది. అలాగే అతని మార్కెట్ వేల్యూ కూడా 40 కోట్ల నుంచి 60 కోట్లకి చేరింది.

ఈ లెక్కల ప్రకారమే నాని అత్యధిక రెమ్యునరేషన్ ని అందుకుంటున్న టైర్ 2 హీరోగా ఉన్నాడు. సరిపోదా శనివారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి ఏమైనా రెమ్యునరేషన్ పెంచుతాడా లేదంటే 25 కోట్ల దగ్గరే ఉంటాడా అనేది చూడాలి. ఇక 2008లో అష్టాచెమ్మా సినిమాతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన నాని కంటిన్యూస్ గా మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు. కెరియర్ ఆరంభంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేక కొంత ఇబ్బంది పడ్డారు. అయితే 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి నాని కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: