మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో ‘ఉప్పెన’ పుట్టించిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటించాడు.  వరుస అవకాశాలతో దక్షిణాదిలో సంచలనం సృష్టిస్తున్నదీ బ్యూటీ. అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను అలరిస్తున్నది. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న బేబమ్మ తాజాగా ‘మనమే’ సినిమాతో మరోసారి సినీ ప్రేక్షకుల్ని పలకరించింది.ఇక ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్

 సైతం సూపర్ హిట్ కొట్టింది. నాని హీరోగా సోషియో ఫాంటసీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కించారు. సాయి పల్లవి మరొక హీరోయిన్ గా నటించింది. బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది.  అలా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. కానీ అవేవి ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. దీంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. మరోవైపు మలయాళంలోనూ ఓ సినిమా చేస్తోంది. ఇక తన కెరీర్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది కృతి. 'నా తొలిచిత్రం 'ఉప్పెన' హిట్ అయింది. కానీ ఒక సెక్షన్ జనాలు నాకు ఫ్లాప్

 వస్తే వేలెత్తి చూపించాలని ఎదురు చూశారు. అయితే నేను హిట్, ఫ్లాప్ రెండింటినీ ఒకేలా తీసుకున్నా. నా ఫస్ట్ మూవీ సక్సెస్‌లో మొత్తం క్రెడిట్ తీసుకోలేదు. అలాగే ఫ్లాప్‌లోనూ పూర్తి క్రెడిట్ తీసుకోను' అని చెప్పింది. విజయాల కంటే పరాజయాల వల్లే ఎక్కువ విషయాలు నేర్చుకున్నానని, తన సినిమాలు ఎందుకు ఆడలేదనే అనాలసిస్ వల్ల విమర్శలను ఎదుర్కొని నిలబడగలిగానని చెప్పిందామె. అయితే తనకు ప్లాప్ రావాలని అంతగా కోరుకున్న ఆ వ్యక్తులు ఎవరో మాత్రం కృతి రివీల్ చేయలేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అయ్యాయి.ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ సినిమాలు చేసింది. ఆతర్వాత ఈ అమ్మడు శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమా చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: