దగ్గుబాటి లక్ష్మి అంటే సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. నాగార్జున మొదటి భార్య..అలాగే ది గ్రేట్ లెజెండరీ నిర్మాత అయినటువంటి దగ్గుబాటి రామానాయుడు కూతురు..  సురేష్ బాబు, వెంకటేష్ ల సోదరి..నాగచైతన్య తల్లి గా ఎంతో మందికి సుపరిచితురాలు.అయితే అలాంటి దగ్గుబాటి లక్ష్మి నాగార్జునతో పెళ్లి విడాకుల తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. మరి ఇంతకీ దగ్గుబాటి లక్ష్మి పెళ్లి చేసుకుంది ఎవరిని.. ఆమె పెళ్లి చేసుకోవడం నాగచైతన్యకు ఇష్టం లేదా అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున లక్ష్మీల పెళ్లి ప్రేమ వివాహం కాదు.కేవలం పెద్దలు కుదిర్చిన పెళ్లి. అందుకే వీరి వివాహం ఎక్కువ రోజులు నిలబడేలేదు కావచ్చు. అయితే ప్రేమ వివాహం అయితేనే ఎక్కువ రోజులు బంధం కొనసాగుతుంది అని కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి లోనే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేస్తారు. కానీ పెళ్లి చేసుకున్న వారి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే అమెరికా అబ్బాయి పల్లెటూరి అమ్మాయి అయినా సరే జీవితాంతం తోడుగా ఉండవచ్చు.

 అండర్స్టాండింగ్ అనేది లేకపోతే ఎవరి బంధం అయినా సరే మధ్యలోనే ముక్కలవ్వక తప్పదు. అయితే అచ్చం ఇలాగే నాగార్జున లక్ష్మీల బంధం తెగిపోయింది. వీరి పెళ్ళై నాలుగు సంవత్సరాలు కూడా కాకముందే విడాకులు తీసుకున్నారు.సేమ్ టు సేమ్ నాగచైతన్య సమంత లాగే. నాగార్జున లక్ష్మీ లకు నాగచైతన్య పుట్టాక వీరి విడాకులు జరిగాయి.అయితే వీరి విడాకులకు కారణం ఎన్నో విషయాలు ఇప్పటికి నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి..కొంతమందేమో నాగార్జున వేరే అమ్మాయితో తో తిరగడంతో దగ్గుబాటి లక్ష్మి విడాకులు ఇచ్చింది అంటే మరికొంతమందేమో లక్ష్మి నాగార్జునని సినిమాలు మానేసి తనతో అమెరికా రమ్మని ఇబ్బంది పెట్టిందని, కానీ నాగార్జునకు ఇష్టం లేక ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవని చెబుతుంటారు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఇప్పటివరకు ఎవరూ బయట పెట్టలేదు. 

అయితే నాగార్జున లక్ష్మి విడిపోయాక నాగచైతన్య తల్లి దగ్గరే పెరిగాడు.అప్పుడప్పుడు సెలవులకు తండ్రి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు.అయితే దగ్గుబాటి లక్ష్మి విడాకుల తర్వాత శ్రీరామ్ మోటార్స్ సంస్థ అధినేత అయినటువంటి శరత్ విజయ్ రాఘవన్ ని పెళ్లి చేసుకుంది.అయితే తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నాగచైతన్య తండ్రి దగ్గరికి వచ్చాడు అని ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే నాగచైతన్య తన తల్లి రెండో వివాహాన్ని తప్పు పట్టలేదు. అలాగే లక్ష్మీ శరత్  విజయ్ రాఘవన్ లకు పుట్టిన కొడుకు పెళ్లికి కూడా నాగచైతన్య వెళ్లారు. అలాగే రీసెంట్గా శోభిత, నాగచైతన్య ల ఎంగేజ్మెంట్ కి కూడా దగ్గుబాటి లక్ష్మీ తన రెండో భర్త అలాగే తన కొడుకు కోడలు తో కలిసి వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: