సరిపోదా శనివారం ' సినిమా కెళతారా.. ఆ పని చేయకపోతే థియేటర్లో మీకు నీరసం పక్కా..?
నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమా ఈ వీకెండ్ కానుకగా గురువారం ధియేటర్లలోకి వచ్చింది . మామూలుగా కొత్త సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే నాని సినిమా ఒకరోజు ముందుగానే.. గురువారమే థియేటర్లలోకి వచ్చింది . నిజం చెప్పాలంటే దసరా సినిమా పాన్ ఇండియా రేంజ్లో మంచి హిట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా ను కూడా పాన్ ఇండియా రేంజ్లో 5 భాషలలో రిలీజ్ చేశారు. నాని ఈ సినిమాకు నార్త్ ఇండియాలో గట్టిగా ప్రమోషన్లు చేశారు.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు.. తొలి రోజు ప్రేక్షకుల నుంచి.. అటు సమీక్షకుల నుంచి సానుకూల సమీక్షలే వచ్చాయి. మెజార్టీ పీపుల్ సినిమా బాగుందని రివ్యూ ఇచ్చారు. అయితే టాక్ అనుకూలంగా ఉన్న.. తొలిరోజు నాని సినిమాకు అనుకున్న స్థాయిలో వసూలు అయితే రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.6 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్.. రూ.11.38 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ . 42 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ఉంది. అయితే సినిమాకు మేజర్ కంప్లైంట్.. భారీ రన్‌టైం అని అంటున్నారు.
ఏకంగా 174 నిమిషాల పాటు చాలా ఓపికతో సాగదీతతో సినిమా చూడాల్సి వస్తుందని.. సినిమాకు వెళ్లేవారు తప్పనిసరిగా భోజనం చేసి వెళ్లటమా.. లేదా ఫుల్లుగా టిఫిన్ చేసి అయినా వెళ్లాలని.. లేకపోతే స్లోగా మూవ్ అయ్యే ఈ సినిమాను చూడాలంటే థియేటర్లలో నీరసాలు తప్పవు అన్న కామెంట్లు, సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నాని ఇంతకు ముందు సినిమా లు కూడా రన్ టైం ఎక్కువగా ఉందన్న కంప్లైంట్లు వచ్చిన.. ఈ సినిమా విషయంలోనూ వారు ఎక్కడ వెనక్కి తగ్గలేదు.