సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రజినీకాంత్. ఇదిలా ఉంటే కూలీ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రం పై సాలిడ్ బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ మార్క్ క్యాస్టింగ్  ఇప్పుడు కనిపిస్తుంది. కోలీవుడ్ నుంచి తలైవర్ మొన్ననే మళయాళ సినిమా నుంచి టాలెంటెడ్ నటుడు సౌబిన్ సాహిర్ ను "దయాల్" అంటూ పరిచయం చెయ్యగా కింగ్ నాగార్జున ని "సైమన్" అంటూ పరిచయం చేశారు లోకేష్. దీనితో ఒక్క సారిగా

 అభిమానులకి  కూలీ సినిమా పై మరింత  అంచనాలు నెలకొన్నాయి. ఇక  సినిమా అనౌన్స్ చేసిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని హైలైట్ చేసారు. ఇప్పుడు ఆంగ్లంలో ఆ పదానికి సంబంధించే ఒకో అక్షరం తాలూకా పాత్రదారుణ్ని రివీల్ చేస్తున్నారు అంటూ గతంలో లియో తరహాలో ఒక థియరీ సోషల్  మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా డిస్కో లో ఎస్ తో మొదలయ్యే సైమన్ డి తో మొదలయ్యే దయాల్ లు పరిచయం అయ్యారు. కాగా ఇందులో ఇంకో ముగ్గురు పరిచయం కావాల్సి ఉందని చెప్పుకొస్తున్నారు. కాగా నిజంగానే క్యాస్టింగ్ ఇలా జరుగుతుందా లేదా అనేది మరో అప్డేట్ వస్తేనే అభిమానులకి ఈ విషయం పై క్లారిటీ వస్తుంది.

 ఇది ఇలా ఉంటే రజినీకాంత్ కూలీ సినిమా తమిళ సినిమా ఇండస్ట్రీలో కొత్త చరిత్రను సృష్టించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించాయి. "మాస్టర్", "విక్రమ్" వంటి సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రజినీకాంత్‌తో కలిసి చేస్తున్న "కూలీ" సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: