సినీ సెలెబ్రిటీల ప్రేమాయణాలు పెళ్లి వ్యవహారాలు ఎప్పుడూ సోషల్ మీడియా జనాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఎవరైనా హీరో హీరోయిన్లు ప్రేమలో కొనసాగుతున్నారు అంటే చాలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఎక్కడికైనా వెళ్తున్నట్లుగా ఆయా సినీ సెలెబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లోకి  వచ్చాయి అంటే చాలు అవి మొత్తం సోషల్ మీడియాను  చుట్టేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 అయితే గత కొంతకాలా నుంచి తమ ప్రేమ వ్యవహారంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి.. వీరిద్దరూ  కొన్ని రోజులపాటు తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగానే ఉంచారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ కలిసి కనిపించడంతో వీరి మధ్య ఏదో నడుస్తుంది అని ఇంటర్నెట్ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఓ రోజు గుడిలో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇక తాము ప్రేమలో ఉన్నాము అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లెప్పుడు అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది.


 పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ఎక్కడ చేసుకుంటారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. ఇదే విషయంపై హీరోయిన్ అదితి రావు హైదరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వనపర్తి లోని శ్రీరంగాపురం టెంపుల్ లో నటుడు సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుంటాను అంటూ హీరోయిన్ అదితి చెప్పుకొచ్చింది. త్వరలోనే పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేస్తాము అంటూ తెలిపింది. హైదరాబాదులో మా నాన్నమ్మ స్థాపించిన స్కూల్లోనే సిద్ధూ మోకాలి పై కూర్చుని నాకు ప్రపోజ్ చేశాడు. ఆయన ప్రపోజ్ చేసిన విధానం నాకు ఎంతో నచ్చింది. మా నాన్నమ్మ ఆశీస్సుల కోసమే ఆయన అక్కడ ప్రపోజ్ చేశాడు అంటూ అది చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: