టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, తారక్ కాంబోలో తెరకెక్కుతున్న ది మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘దేవర’. ఇందులో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దేవర చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్-1 సెప్టెంబర్ 27 వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది.దేవర నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చిన చుట్టమల్లె సాంగ్ అటు సోషల్ మీడియాను, ఇటు యూట్యూబ్ ను షేక్ చేస్తోందనడంలో అతిశయోక్తి లేదు. దీంతో దేవర మూవీపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇక ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ తెలుపుతూ చుట్ట మల్లె పాటకు ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 125 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్ర బృందం ప్రకటించింది.ఒక్క తెలుగులోనే 92 మిలియన్లవ్యూస్ వచ్చాయి.ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ గా ఉందని పేర్కొంది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా దేవర సినిమా నుంచి మూడో పాట కూడా రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ పాట గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. ఈ సాంగ్ కూడా మాస్ బీట్‍తో ఉండే అవకాశం ఉంది. దేవర చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వచ్చిన ‘ఫియర్ సాంగ్’, ‘చుట్టమల్లే’ చార్ట్ బస్టర్లు అయ్యాయి. దీంతో మూడో పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: