మోక్షజ్ఞ తో సినిమాకు చాలామంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మనే ఎంచుకున్నారు.. బాలకృష్ణ కూడా తన కుమారుడు సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేస్తారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాతగా సుధాకర్ చేకూరి పేరు ఫైనల్ గా వినిపిస్తోంది.. వాస్తవానికి అఖండ-2 సినిమా చేయాల్సి ఉండగా కుదరకపోవడం వల్ల.. అంతే కాకుండా మిగిలిన బ్యానర్లలో కూడా బాలయ్య ఒక్కో చిత్రంలో నటించారు. కేవలం సుధాకర్ చేకూరి వైపే బాలయ్య ముగ్గు చూపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాకి నిర్మాతలు కన్ఫర్మ్ అయిపోతే భారీ ఓపెనింగ్ కూడా ఉండబోతుందట.
ముఖ్యంగా బాలయ్య తన కుమారుడిని ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తాలు కూడా సెప్టెంబర్ ఆరవ తేదీన ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరో అద్భుతమైన మైథాలజికల్ టచ్ సోషియో ఫాంటసీ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడిని ఎంట్రీ చేయడానికి సిద్ధమయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది. బాలయ్య కుమారుడి పాత్ర అభిమన్యుడు పాత్రకు లింక్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. అయితే అర్జునుడి పాత్ర బాలయ్య చేయబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. మొత్తానికి ఒక భారీ సినిమాకు బాలయ్య కుమారుడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. బాలకృష్ణ 50 ఏళ్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినిమా వాళ్లు చాలా గ్రాండ్ గా బాలయ్య కోసం ఫంక్షన్ చేస్తున్నారు. మరి ఈరోజు ఏమైనా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి.