సుమన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో స్టార్ హీరోయిన్లు అందరూ సుమన్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో ఆరాట పడేవారు. సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. మాతృభాష కూడా తెలుగు కాకపోయినా సుమన్ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాడు. సుమన్ సినిమాల్లోకి రాక ముందు సినిమా అవకాశాల కోసం చాలా తిరిగేవాడు. ఆయనకు హీరో భానుచందర్ తో మంచి స్నేహం ఉంది. సుమన్ కెరీర్ పరంగా మంచి క్రేజ్ లో ఉన్న సమయంలో సుమన్ కు దెబ్బ పడింది. నీలిచిత్రాల కేసులో జైలుకు వెళ్లగా.. బెయిల్ రాక చాలా రోజులు జైల్లోనే ఉన్నారు.
సుమన్ జైలు నుంచి విడుదలయ్యాక అవకాశాల కోసం కాస్త ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వివాహం అనే బంధంతో శిరీష రూపంలో అదృష్టం తలుపు తట్టింది. కొడుకు దిద్దిన కాపురం, గుండమ్మ కథ, రాముడు భీముడు, యమగోల వంటి సూపర్ హిట్ సినిమాల్లో కథలను అందించిన డి.వి.నరసరాజు గారు తన మనవరాలు శిరీషను సుమన్ కు ఇచ్చి పెళ్లి చేయడంతో ఇండస్ట్రీ ఆలోచనలో పడింది. తిరిగి సుమన్ కు వరుసగా అవకాశాలు రావడం ప్రారంభించారు.