సరిపోదా శనివారం అంటూ థియేటర్లలోకి వచ్చిన నాని మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు హిట్ టాక్ రావడంతో బుకింగ్స్ కూడా బాగా పెరిగాయి. నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఇదే భారీ గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా నార్త్ అమెరికాలో కూడా నాని మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. నార్త్ అమెరికాలో రెండో రోజు ప్రారంభానికి 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ని నాని సినిమా సాధించింది. దీంతో నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో హీరోగా నాని రికార్డు అందుకున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో మహేష్ బాబు నిలిచారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు 12 సినిమాలు నార్త్ అమెరికాలో రిలీజ్ అయ్యాయి. అన్నీ కలిపి 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ సాధించాయి. నేచురల్ స్టార్ నాని కూడా ఏకంగా 10 సినిమాలకు గాను 1 మిలియన్ డాలర్స్ రీచ్ అయ్యారు. టాలీవుడ్ హీరోలు మరెవ్వరూ కూడా ఆ రికార్డును సొంతం చేసుకోలేకపోయారు. నాని విషయానికి వస్తే గతంలో హాయ్ నాన్న విడుదలైంది. ఆ మూవీ 1.89 మిలియన్, దసరా 2.76 మిలియన్, అంటే సుందరానికి మూవీ ఒక మిలియన్ కలెక్షన్స్ సాధించాయి. నాని వరుసగా నాలుగు సినిమాలతో ఓవర్సీస్‌లో రికార్డు నమోదు చేశాడు.

నాని తర్వాత ఇంకెవరూ కూడా ఆయన దరిదాపుల్లో నిలువలేదు. ఇక మొన్న రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ అందుకుంటుందని ఆయన అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా తొలి రోజు రూ.19.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. అయితే దసరా ఫస్ట్ డే కలెక్షన్స్‌ను అందుకోలేకపోయిందని చెప్పాలి. ఈ మూవీ ఇంకో నాలుగు రోజుల్లో రూ.50 కోట్లను వసూలు చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ఈ మూవీతో నాని మరో హిట్టు కొట్టాడని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: