మాస్ మహారాజా రవితేజ తాజాగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతి బాబు విలన్ పాత్రలో నటించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు రాలేదు. ఇక ఈ సినిమాకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇకపోతే తాజాగా మైత్రి సంస్థ వారు మత్తు వదలరా 2 అనే సినిమాను రూపొందించారు. ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను నిన్న విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ విడుదల కోసం ఈ మూవీ బృందం ఓ ఈవెంట్ ను నిర్వహించింది.

అందులో భాగంగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి రవి శంకర్ పాత్రికేయలతో ముచ్చటించాడు. అందులో భాగంగా ఈయనకు మిస్టర్ బచ్చన్ మూవీ ద్వారా ఎంత నష్టం వచ్చింది అనే ప్రశ్న ఎదురయింది. దానితో ఆయన లాభ నష్టాలు అనేవి సినిమా ఇండస్ట్రీలో కామన్. అవన్నీ ఉంటాయి అని తెలిసే వచ్చాము. ఇక మిస్టర్ బచ్చన్ కు లాభాలు , నష్టాలు వచ్చేయి అనే లెక్కలు వేసుకోలేదు. ఒక సినిమాతో వస్తాయి ... ఒక సినిమాతో పోతాయి అని రవి శంకర్ సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: