మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. మహిళలు లైంగిక వేధింపులతో పాటు పారితోషికాల్లో ఇబ్బందులు, షూటింగ్ లొకేషన్లలో కనీస సౌకర్యాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హేమ కమిటీ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశం యొత్తం చర్చనీయాంశమవుతుంది.

ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించడం విశేషం. ఈ విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే నటి రాధిక.... హేమ కమిటీ రిపోర్ట్ పైన స్పందించడం జరిగింది. మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా చాలా ఇండస్ట్రీలలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. కొంతమంది వ్యక్తులు నటిమణుల కారవాన్ లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆమె ఆరోపించారు.


చిత్ర పరిశ్రమలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడం చాలా దురదృష్టకరం. 46 ఏళ్ల నుంచి నేను సినీ పరిశ్రమలో ఉన్నాను. అన్ని చోట్ల మహిళలకు ఇదే విధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని నా భావన. ఒక సినిమా చిత్రీకరణలో భాగంగా కేరళ వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఘటనను నేను ఇప్పటికీ మర్చిపోలేను. షాట్ ముగించుకొని నేను వెళుతున్న సమయంలో సెట్ లో కొంతమంది మగవాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఫోన్ లో ఏదో చూస్తు నవ్వుతున్నారు.

ఏదో వీడియో చూస్తున్నారని అర్థమైంది. చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తిని పిలిచి ఏం చూస్తున్నారని నేను అడిగాను. కారవాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళల ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని ఫోన్లో చూస్తున్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఈ అంశంపై టాలీవుడ్ స్టార్ నటి సమంత మరోసారి స్పందించారు. హేమా కమికి రిపోర్ట్ ను స్వాగతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: