బిర్సా ముండా అంటే 1875-1900 కాలం నాటి ఆదివాసీ నాయకుడు. ఆయన జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం ఎంతగానో పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంచారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు కూడా పెట్టారు.అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కిస్తే ఆయన గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను దర్శకుడు పా. రంజిత్ తెలియజేయనున్నారు..