ఆంధ్రప్రదేశ్లో గడచిన కొన్ని నెలల నుంచి ఎన్నో సంఘటనలు మహిళల పైన జరుగుతూనే ఉన్నాయి.. కానీ ఇటీవలే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఒక ఉదాంతం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది.. ముఖ్యంగా అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం దాదాపుగా 300 మంది అమ్మాయిల  వీడియోలు బయటపడడంతో ఒక్కసారిగా ఏపీలో ఈ విషయం అగ్గిరాజేసింది. తాజాగా ఇలాంటి ఘటన పైన ఇప్పటికే చాలామంది నేతలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ పూనమ్ కౌరు కూడా స్పందించింది.

పూనమ్ కౌర్ ఇలా స్పందిస్తూ.. ఆ అమ్మాయిలకు మద్దతు తెలుపుతూ ప్రియమైన అమ్మాయిలారా నేను మిలో ఒకరిగా నేను ఈ లేఖను రాస్తున్నాను.. మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో నమ్మకంతో బయటికి పంపిస్తూ ఉంటారు. కానీ బయట జరుగుతున్న పరిణామాలు తెలిసి చాలా బాధపడుతున్నాను మీకు ఇటీవల జరిగిన పరిస్థితులు చాలా దారుణమైన సంఘటన.. విద్యార్థి సంఘాలు బలంగా పోరాడితేనే అసలు నిజం బయటికి వస్తుందని.. చట్టం బలహీనులను బలంగా బలవంతులను బలహీనంగా చేస్తుందని మనదేశంలో ఇటీవల ఎన్నో జరిగిన సంఘటనలు చూసే ఉన్నామంటూ తెలిపింది.


ముఖ్యంగా నేరస్తులు ఎలా రక్షించబడతారు బాధితులు ఎలా అవమానింపబడతారు అది నాకు బాగా తెలుసు.. అటువంటి చర్యలు తాను మానసికంగా కూడా చూసి అలసిపోయాను.. కాలేజీ డిగ్రీ సర్టిఫికెట్లను రద్దు చేసి మరి బయటికి పంపించి స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేసిన సంఘటనలు కూడా అనేకంగా ఉన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే మీరు మాత్రం వదలకండి నేను కూడా మీకి సపోర్టుగానే నిరసనలను తెలుపుతూ ఉంటారని తెలిపింది. ఒక అమ్మాయి అయ్యి ఉండి.. ఇతర అమ్మాయిలను ప్రమాదంలోకి నెట్టడం చాలా అసహ్యకరం అంటూ.. నేరస్తులకు ఎవరు సహకరించిన వారిని విడిచిపెట్టకూడదని వారికి తగిన గుణపాఠం చెప్పాలి అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం భైరవిగా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: