ఏంటి నిత్యామీనన్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయా.. ఇంతకీ నిత్య మీనన్ ని అలా టచ్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నిత్యామీనన్ తనకు తానుగా బయటికి వచ్చి కాస్టింగ్  కౌచ్ పనులు బయట పెట్టలేదు. అయితే నిత్య మీనన్ చిన్నతనంలో ఉన్న సమయంలో ఆమె ఓ సినిమాలో బాలనటిగా చేసిందట. ఆ సినిమాలో నిత్యామీనన్ కి తల్లిగా నటించిన నటి మాలా పర్వతి సంచలన కామెంట్లు చేసింది. 2010లో మాల పార్వతి ఓ సినిమాలో నటించింది. ఆ సినిమాలో నటించిన సమయంలో నిత్యామీనన్ నాన్సి అనే తన కూతురు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో నిత్య మీనన్ కి తండ్రిగా నటించిన నటుడు ఆ సినిమా షూటింగ్లో దారుణంగా ప్రవర్తించాడు. తండ్రి పాత్రలో ఉన్న ఆ నటుడు నిత్యమీనన్ ని ఆప్యాయంగా టచ్ చేయాలి.

కానీ ఆయన ఓ పక్కన ఆప్యాయంగా టచ్ చేస్తూనే సుఖం పొందినట్టు ఫీల్ అయ్యాడు. నిత్యామీనన్ విషయంలోనే కాదు నిత్యమీనన్ ని టచ్ చేస్తూ నన్ను కూడా అక్కడక్కడ టచ్ చేయడంతో నాకు ఆయన టచ్ అస్సలు నచ్చలేదు.ఇక ఈ సినిమా షూటింగ్లో ఆయనకి నేను భార్యగా నటించాను కాబట్టి చాలాసార్లు టచ్ చేసే సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఈ సన్నివేశంలో నేను సరిగ్గా నటించలేకపోయాను.దాంతో డైరెక్టర్ శిబి మలైయిల్ నన్ను అర్థం చేసుకొని టచ్ చేయకుండా కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. కానీ ఆ సినిమా మాత్రం నేను అసలు ఇష్టంగా చేయలేదు. ఆ సినిమా చేసే సమయంలో నేను మానసికంగా శారీరకంగా ఎంతో ఇబ్బంది అనుభవించాను.

కానీ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. దాంతో ఈ సినిమాలో నేను సరిగ్గా నటించలేకపోయాను. ఆ తర్వాత వెంటనే నేను నా సొంత డబ్బులతో ఒక క్యారవ్యాన్ ని కొనుక్కున్నాను అంటూ నటి మాల పార్వతి సంచలన కామెంట్లు చేసింది.ఇక మాల పార్వతి ఈ షాకింగ్ కామెంట్లు చేయడంతో మాల పార్వతికి నిత్యమీనన్ కూతురుగా చేసిన సినిమా ఏంటి... శిబిమలైయిల్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా పేరేంటి..అందులో మాల పార్వతి నిత్యామీనన్ తో అసభ్యంగా నటించినా ఆ నటుడు ఎవరబ్బా అని తెలుసుకునే పనిలో పడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: