సాధారణంగా స్టార్ హీరోలకు హీరోయిన్లకు కోట్లాదిమంది అభిమానులు ఉంటారు. ఏకంగా దేవుళ్ల లాగా ఆరాధిస్తూ ఉంటారు. కానీ కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు, ఐటమ్ సాంగ్స్ చేసే డాన్సర్లకు అభిమానులు ఉంటారా.. ఉంటారు అనుకోండి కానీ హీరో హీరోయిన్ల రేంజ్ లో వారికి పెద్దగా అభిమానులు ఉండరు అని అంటారు ఎవరైనా. కానీ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఐటెం సాంగ్స్ లో డాన్సులు చేస్తూ ఏకంగా హీరో హీరోయిన్లను మించిన క్రేజ్ సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది దివంగత నటి సిల్క్ స్మిత అని చెప్పాలి.


 ఈమె పేరు వినిపిస్తే చాలు అప్పట్లో థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయేది. ఈమెను చూడడానికే థియేటర్కు వెళ్లే ప్రేక్షకులు అప్పట్లో చాలామంది ఉండేవారు. ఇలా ఇండస్ట్రీలో హీరోలను తలదన్నే క్రేజ్ ని సొంతం చేసుకుంది. సిల్క్ స్మిత తర్వాత కాలంలో మాత్రం మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచేసింది. ఇండస్ట్రీని ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇక ఆమె జీవిత కథ ఆధారంగా ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ డర్టీ పిక్చర్ అనే సినిమా కూడా తీసింది.


 ఇక ఈ మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో కూడా ఎన్నో నిజాలను దాచిపెట్టారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఎవరు అనే విషయంపై ఎప్పుడు ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెరమీదకి వస్తూనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సిల్క్ స్మిత ఆత్మహత్యకు కారణమట. అప్పట్లో రజినీకాంత్ సిల్క్ స్మిత మధ్య ప్రేమాయణం నడిచింది అనే టాక్ ఉండేది. ఆమె లేకుంటే రజిని సినిమాలు చేసేవాడు కాదట. వీళ్ళ కెమిస్ట్రీ ప్రేక్షకులను గుర్తించడం.. వీళ్ళ జోడి సెన్సేషన్ అవ్వడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే నిర్మాతగా మారి నష్టపోవడంతో సిల్క్ స్మిత మానసిక క్షోభ కి గురైపోయింది. ఆ తర్వాతే ఎన్నో వ్యసనాలకు అలవాటు పడింది. ఇక సమయంలో రజనీకాంత్ తో బ్రేకప్ కారణంగానే సిల్క్ స్మిత వ్యసనాలకు అలవాటు పడిందని.. అందుకే ఆమెకు చావుకి రజనీకాంత్ కూడా ఒక రకంగా పరోక్షంగా కారణమయ్యాడని కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: