నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెరుథె ఒరు భార్య, మధ్య వెనాల్ వంటి మలయాళ సినిమాలలో బాలనాటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఆ తర్వాత జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.


సినిమా అనంతరం విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నివేదా నిన్ను కోరి, జై లవకుశ, దర్బార్, వకీల్ సాబ్, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, షాకిని డాకిని, 35 చిన్న కథ కాదు వంటి అనేక సినిమాల్లో అవకాశాలను దక్కించుకొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నివేదా మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.


ఆ తర్వాత నిన్ను కోరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేదా ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. చివరిసారిగా 2022 లో వచ్చిన షాకిని డాకిని సినిమాలో కనిపించి మెప్పించింది. నివేదా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా నివేదా థామస్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్, విశ్వతేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 35 చిన్న కథ నహీ సినిమాలో నటించింది. ఈ సినిమాను హీరో రానా నిర్మించారు. నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేద ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తోంది. ఒకప్పుడు ఎంతో సన్నగా క్యూట్ గా ఉండే నివేదా ఇప్పుడు చాలా బోద్దుగా తయారైంది. అందుకే నివేదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయేమోనని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో నివేదా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: