* ఒకే ఏడాదిలో డబుల్ హైట్రిక్
* 200 రోజులపై ఆడిన బాలయ్య సినిమాలు
* 1986  6 బ్లాక్ బస్టర్లు
* డ్యూయల్‌ రోల్‌ సినిమాల్లోనూ అదరగొట్టిన బాలయ్య


టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య ఇప్పటికి టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. బాల్య నటుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నందమూరి బాలయ్య... ఇప్పటికీ టాప్ మోస్ట్ హీరో గానే ఉండటం గమనార్హం.  అయితే ఆగస్టు 30వ తేదీ వరకు నందమూరి బాలయ్య సినిమా కెరియర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ తరుణంలోనే 50 సంవత్సరాల పండుగను కూడా గ్రాండ్గా నిర్వహించబోతుంది నందమూరి కుటుంబం.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి బాలయ్య కు సంబంధించిన సినిమాలు, ఆయన సాధించిన రికార్డు విజయాలు, అవార్డుల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అంతటి టాప్ మోస్ట్ హీరో నందమూరి బాలయ్య... ఒకే సంవత్సరంలో 6 బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నాడు. అది కూడా 1986 సంవత్సరం కాలంలో కావడం గమనార్హం. ఆ సినిమాల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.


ముద్దుల కృష్ణయ్య అనే సినిమా 1986 లోనే వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి, రాధా నటించిన జరిగింది. ఈ సినిమా అప్పట్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. జంధ్యాల దర్శకత్వంలో సీతారామ కళ్యాణం సినిమాను బాలయ్య తీశారు. ఈ సినిమా కూడా..  ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే ఏడాది అనసూయమ్మ గారి అల్లుడు సినిమా కూడా బాలయ్య ఖాతాలో పడింది.ఈ సినిమా ఏకంగా 200 రోజులు థియేటర్లలో ఆడడం జరిగింది.


బాలయ్య అదే సంవత్సరంలో చేసిన మరో సినిమా దేశోద్ధారకుడు. ఈ సినిమా అప్పట్లో ఐదు కోట్లు వసూలు చేసి బంపర్ హిట్ అందుకుంది. అలాగే కలియుగ కృష్ణుడు కూడా బాలయ్య కెరీర్లో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఆరవ సినిమా కూడా... అదే సంవత్సరంలో రిలీజ్ చేసి మరో సక్సెస్ అందుకున్నాడు బాలయ్య. ఆ సినిమానే అపూర్వ సహోదరులు.  ఈ సినిమాను రాఘవేంద్రరావు రూపొందించారు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేశారు నందమూరి బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: