- తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు..
- తండ్రి ఆశయాలు కొనసాగిస్తున్న బాలయ్య..
- తండ్రికి పోటీగా ఎన్నో చిత్రాలు చేసిన బాలయ్య..

 నందమూరి బాలకృష్ణ..ప్రస్తుతం ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే తన తండ్రి చలవే అని చెప్పవచ్చు. తండ్రి అడుగుజాడల్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాజకీయాలను కూడా శాసిస్తున్నారు. అలాంటి బాలయ్యకు తండ్రితో విడదీయలేని బంధముంది. తండ్రితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా, సినిమాల్లో మాత్రం తండ్రి ద్వారానే ఎంట్రీ ఇచ్చారు.  అలాంటి బాలకృష్ణ చివరికి తండ్రి సినిమాలకే పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో నిలబడ్డారని చెప్పవచ్చు.  అలాంటి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో చేసిన సినిమాలు ఇతర వివరాలు ఏంటో చూద్దాం..

 బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ ల బంధం:
నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు గడిచింది. తాతమ్మ కల అనే సినిమా ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. ఇలాంటి బాలకృష్ణ తన తండ్రి తో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రితో చేసిన కొన్ని చిత్రాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఎన్టీఆర్ కథానాయకుడు అనే సినిమాలో కూడా నటించారు. అయితే బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై సినిమా చేయడమే కాకుండా తన తండ్రి చేసినటువంటి పాత్రల్లో ఎన్నోసార్లు ఆయన కూడా నటించారు.  ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి శ్రీరాముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుశ్శంతుడు,శ్రీకృష్ణదేవరాయలు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక పాత్రల్లో నటించారు.  ఇక ఇవే కాకుండా తండ్రితో కలిసి మొత్తం 12 చిత్రాలు చేశాడు. తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కల చిత్రంలో చేసిన బాలకృష్ణ, రామ్ రహీం, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట్ పర్వం,అన్నదమ్ముల అనుబంధం,వేములవాడ భీమకవి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది వంటి చిత్రాల్లో నటించారు. 


ఇక సాహసమే జీవితం అనే చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా మారారు. ఇక బాలయ్య సినీ కెరియర్లో తొలి సినిమా తాతమ్మకల చిత్రంతో మొదలుపెట్టి ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోలేదు. హీరోగా నటిస్తూ 50 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేశారు. అలాంటి బాలకృష్ణ ఇప్పటికీ ఎలాంటి సినిమా ఫంక్షన్స్ అయినా రాజకీయ ప్రోగ్రామ్స్ అయినా తన తండ్రిని గుర్తు చేసుకోని క్షణం ఉండదు.. ఇప్పటికీ ఆయన ఆశయాలనే కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన స్థాపించిన బసవతారకం ఆసుపత్రిని కొనసాగిస్తూ ఎంతోమంది పేదలకు వైద్యాన్ని అందిస్తున్నారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. ఈ విధంగా బాలకృష్ణ తన తండ్రి తో ఉన్న అనుబంధాన్ని  తాను ఉన్నన్ని రోజులు కొనసాగిస్తానని చెబుతూనే ఉన్నారు. అలాంటి ఈయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాజకీయ, సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: