తెలుగులో అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో మొదట హిందీలో ప్రారంభం అయింది. దీనికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. దానితో ఆ తర్వాత ఈ షో ను పలు ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా తెలుగు భాషలో కూడా మొదలు పెట్టారు. తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ బుల్లి తెరపై 7 సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఓ టీ టీ పై ఒక సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ రోజు నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది.

ఈ రోజు 7 గంటల నుండి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వివరించబోతున్నాడు. ఇకపోతే ఈ రోజు స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ సీజన్ 8 కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని "బిగ్ బాస్" సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. డి విక్వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఆగస్టు 15 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే నాచురల్ స్టార్ నాని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: