టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ నటుడు ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో టికెట్లను యూ ఎస్ ఏ లో ఈ మూవీ బృందం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను యూ ఎస్ ఏ లో సెప్టెంబర్ 26 వ తేదీనే ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే యూఎస్ఏ లో ఈ మూవీ ప్రీమియర్స్ టికెట్స్ కి 100 కే ప్లస్ ప్రీ సేల్స్ జరిగినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ న కూడా విడుదల చేసింది. ఇంకా ఈ సినిమా విడుదలకు 27 రోజులు ఉంది.

ఇంత ముందుగానే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ సేల్స్ 100 కే ప్లస్ ను టచ్ చేయడంతో మరికొన్ని రోజుల్లో ఈ సినిమా యూ ఎస్ ఏ లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనబడుతుంది. మరి ఈ మూవీ కి యూ ఎస్ ఏ లో ప్రీమియర్స్ ద్వారా ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి. ఇప్పటివరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: