నాచురల్ స్టార్ నాని స్టోరీ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అందువల్లనే ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించాయి ఆయన నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా అవి కూడా మరి దారుణమైన స్థితిలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని హీరోగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నాని కొన్ని సంవత్సరాల క్రితమే ఓ నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే.

నాని అందులో డిఫరెంట్ సినిమాలను , తక్కువ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాని తన నిర్మాణ సంస్థలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా హిట్ ది ఫస్ట్ కేస్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా శైలేష్ కొలను కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నాని నిర్మాణంలో శైలేష్ దర్శకత్వంలో అడవి శేషు హీరోగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఇకపోతే శైలేష్ కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ్ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే నేచురల్ స్టార్ హీరోగా , నిర్మాతగా శైలేష్ దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఇక నాని నిర్మాణంలో రూపొందిన రెండు సినిమాలతో శైలేష్ మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఈ సారి నాని నిర్మాతగా మరియు హీరోగా చేస్తున్న సినిమాకు శైలేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. దీనితో ఈయన మళ్ళీ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: