ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో రిలీజ్ అయిన మొదటి రోజు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు 44.86 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. 

మూవీ తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా 38.88 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది. 

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 9.25 కోట్ల కలెక్షన్లతో 3వ స్థానంలో నిలిచింది. 

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని 7.97 కోట్ల కలెక్షన్లను వసూలు చేసే 4 వ స్థానంలో నిలిచింది. 

తమిళ డబ్బింగ్ సినిమా భారతీయుడు 2 మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 5 వ స్థానంలో నిలిచింది. 

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఇస్మార్ట్ సినిమా విడుదలైన మొదటి రోజు 6.10 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలిచింది. 

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా విడుదల అయిన మొదటి రోజు 5.88 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది.

రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల అయిన మొదటి రోజు 4.56 కోట్ల కలెక్షన్లతో 8 వ స్థానంలో నిలిచింది. 

నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమా విడుదల అయిన మొదటి రోజు 4.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 9 వ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: