రేపు అనగా సెప్టెంబర్ 2 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు ఏమైనా విడుదల అవుతాయేమో అని ఆయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఎదురు చూపులకు ప్రయోజనం లేకుండా పోయేలా కనబడుతుంది. ఎందుకు అంటే రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్సినిమా దర్శకుడు హరీష్ శంకర్ పాత్రికేయలతో ముచ్చటించారు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. దానితో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందా అనే ప్రశ్న ఆయనకు ఎదురయింది. దానితో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ ఉండదు అని చెప్పేశాడు. దానితో పవన్ అభిమానులంత ఓజి సినిమా నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందేమో అని భావించారు. ఇక తాజాగా నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాని దానయ్య నిర్మించాడు. తాజాగా సరిపోదా శనివారం సినిమాకు మంచి టాక్ రావడంతో దానయ్య పాత్రికేయలతో ముచ్చటించాడు.

దానితో ఈయనను పాత్రికేయులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజి మూవీ నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందా అని ప్రశ్నించారు. దానితో దానయ్య ఎలాంటి అప్డేట్ ఉండదు అని చెప్పేసారు. దానితో పవన్ అభిమానులు ఈ రెండు సినిమాల నుండి ఎలాంటి అప్డేట్ లేదు. మరి హరిహర వీరమల్లు నుండి ఏదైనా అప్డేట్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు హరిహర వీరమల్లు మూవీ యూనిట్ కూడా ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్మెంట్ ను చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: