ఈ రోజున బాలయ్య అర్థ శతాబ్దం వేడుక గ్రాండ్ గా హైదరాబాదులో జరగబోతోంది. దీంతో బాలయ్య సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పొలిటికల్ వరకు అలాగే తన జీవితంలో జరిగిన ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులు తెగ వైరల్ గా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య ఎన్నడు లేని విధంగా ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బాలయ్య ఈ షోలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోయారు.


అన్ స్టాపబుల్ షో సక్సెస్ కావడంతో యూత్ కూడా అందరూ బాలయ్య వైపే చూశారు. అయితే బాలయ్య ఈ షో కి రావడం వెనక ఒక కథ ఉందన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ముగ్గురు పిల్లలు మూడు కప్పులు బహుమతిగా ఇచ్చారట.. అందులో పెద్ద కూతురు బ్రాహ్మణి ఇచ్చిన కప్పు మీద అయాయ్ది ఎల్దిస్ట్ సో ఐ మేక్ ది రూల్.. అని రాసి ఉందట.. ఇక చిన్న కూతురు తేజస్విని ఇచ్చిన కప్పు మీద.. అయామ్ ది మిడిల్ అయామ్ రీజన్ టూ హెవ్ ది రూల్స్ అంటూ రాసి ఇచ్చిందట. ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే.. అయామ్ యంగెస్ట్ -రూల్స్ డోంట్ ఎటాక్ట్ మీ అంటూ రాసి ఇచ్చారట.


అలా ఈ మూడింటితో కలసి ఒక పాట రాసి ఇవ్వమని  తన ఇంటికి వచ్చిన  రచయితను ,ఆయన కూతురిని  అడిగనని వెంటనే వారు ఇంగ్లీష్, ఫ్రెంచ్ ,జర్మన్ పదాలతో ఒక పాటను కూడా రాసిచ్చారట. వినోద్ అనే కీబోర్డ్ ప్లేయర్ ఈ పాటకు సైతం ట్యూన్ అందించినట్లు తెలియజేశారు. ఆ తర్వాతే అన్ స్టాపబుల్ అనే పాటని స్టూడియోకి వచ్చి పాడమన్నాకా.. పాడేసిందట.. అయితే మూడు రోజుల తర్వాత తాను రికార్డింగ్స్  స్టూడియో కి వెళ్లి ఆ పాటను పాడగా.. ఆపాటే అన్ స్టాపబుల్ పాట అయిందని .. ఆ పాటకి అల్లు అరవింద్ గారు విని  మన షోకి అన్ స్టాబుల్ అనీ పెడదామని చెప్పగా వెంటనే ఓకే చేశానని తెలిపారు బాలయ్య. అయితే తాను పాడిన ఇంగ్లీష్ పాట ఇంకా రిలీజ్ కావాల్సివందని తెలిపారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: