తెలుగు సినీ పరిశ్రమ లో ఉన్న మీడియం రేంజ్ హీరో లలో అత్యంత ఎక్కువ విజయాలను అందుకున్న హీరో లలో నాని ఒకరు . నాని నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి . చాలా తక్కువ శాతం సినిమాలో మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి . ఇకపోతే నాని మూవీ లకు అమెరికా లో అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి . ఇకపోతే ఇప్పటివరకు నాని నటించిన 10 సినిమాలకు అమెరికాలో ఏకంగా 1 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

నాని హీరోగా రూపొందిన ఈగ సినిమా మొదటి సారి అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత నాని హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన భలే భలే మగాడివోయ్ సినిమా అమెరికాలో 2 మిలియన్ కలెక్షన్లను అందుకుంది. ఇక ఆ తర్వాత నేను లోకల్ సినిమా కూడా 1 మిలియన్ కలెక్షన్లను అమెరికాలో అందుకుంది. ఈ మూవీ తర్వాత నిన్ను కోరి , ఎంసీఏ , జెర్సీ , అంటే సుందరానికి , దసరా , హాయ్ నాన్న , తాజాగా విడుదల అయినా సరిపోదా శనివారం సినిమాలు అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. 

ఇలా నాని హీరోగా రూపొందిన 10 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ కలెక్షన్లను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: