టాలీవుడ్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అందరిలో సాలిడ్ గా అంచనాలు ఉండగా రీ రిలీజ్ లలో కొత్త రికార్డులు నమోదు చేస్తుందని…అందరూ భావిస్తూ ఉండగా…ఆ అంచనాలను నిజం చేస్తూ స్పెషల్ ప్రీమియర్స్ అండ్ డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉన్న గబ్బర్ సింగ్ మూవీ హైదరాబాదులోనే ఆల్ మోస్ట్ 1.65 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా టోటల్ నైజాం ఏరియా ప్రీ బుకింగ్స్ లెక్క..2 కోట్ల రేంజ్ లో దూసుకు పోతూ ఉండగా ఆంధ్రలో రీ రిలీజ్ లో రికార్డ్ బుకింగ్స్ తో 1.25 కోట్ల బుకింగ్స్ మార్క్ ని క్రాస్ చేసింది….టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3.25 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను దాటేసిన సినిమా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 40 లక్షలకు పైగా బుకింగ్స్ ను దాటేసింది.దాంతో టోటల్ ఇండియాలోనే సినిమా 3.65 కోట్లకు పైగా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా అమెరికాలో ప్రీ బుకింగ్స్ గ్రాస్ 48 వేల డాలర్స్ మార్క్ ని దాటేసింది. ఓవరాల్ గా టోటల్ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క 4.2 కోట్లు దాటేసి మాస్ ఊచకోత కోసింది.

ఇదిలావుండగా ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయిన అయ్యాయి.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం సంచలనాలు నమోదు చేస్తోంది. గడచిన 24 గంటల్లో సినిమాటికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’ లో 27K టికెట్స్ బుక్ అయి పవన్ సినిమాకు ఉండే స్టామినా ఏంటో చూపించింది. ఇక అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ విషయంలో గబ్బర్ సింగ్ ఇంతకు ముందు రిలీజైన ఇంద్ర, మురారి, సింహాద్రి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. మురారి అడ్వాన్సు సేల్స్  రూ. 3.46 కోట్లు రాబట్టగా, గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గబ్బర్ సింగ్ కలెక్షన్స్ లో సత్తా చాటుతోంది. నైజాంలో ఈ చిత్రాన్నీ భారీ స్థాయిలో రీరిలీజ్ చేస్తున్నారు. ఫైనల్ రన్ లో ఈ చిత్రం రీరిలీజ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి అల్ టైమ్ రికార్డు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.మొత్తం మీద ఫైనల్ లెక్కలు రీ రిలీజ్ లలో ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్ తో రచ్చ చేయగా ఇండియాలో టోటల్ గా ఇప్పటి వరకు లక్షా 30 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇక ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో గబ్బర్ సింగ్ రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: