కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా వి వి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్రకు మొదటగా సునీల్ ని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సునీల్ ఆ పాత్రలో నటించని కారణంగా వేరే నటుడితో ఆ సినిమాను తెరకెక్కించారు. ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా సునీల్ కు మీరు చిరంజీవి హీరోగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా లో ఆఫర్ వస్తే దానిని రిజెక్ట్ చేశారా అనే ప్రశ్న సునీల్ కు ఎదురయింది.

దీనికి సునీల్ సమాధానం ఇస్తూ ... నేను రిజెక్ట్ చేయలేదు. ఆ సినిమాలో చిరంజీవి తో కలిసి చేయాలి అని నాకు అనిపించింది. దానితో నేనే వెళ్లి అడిగాను. వారు కూడా నాకు ఒక పాత్ర ఇచ్చారు. కానీ నేను అంతకు ముందే ఒక సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాను. ఇక ఆ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు.  వారందరి కాంబినేషన్ సెట్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. కరెక్ట్ గా అదే టైమ్ కి ఖైదీ నెంబర్ 150 లో నాపై షెడ్యూల్ ఉంది.

ఇక ఒక వేళ నేను ఆ సినిమా షూటింగ్ కి కనుక వెళ్లకపోతే మళ్లీ ఆ మూవీ మూడు నెలలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. దానితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో పాత్రను వదులు పెట్ట వలసి వచ్చింది అని సునీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే చిరంజీవి హీరోగా రూపొందిన చాలా సినిమాలలో సునీల్ నటించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: