అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ వైరల్ అయి అంచనాలు భారీగా పెంచాయి. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా వాటిని ఇటీవల సుకుమార్, బన్నీ కొట్టిపారేశారు.పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీనే రిలీజ్ కావాల్సింది. అయితే, డిసెంబర్ 6కు వాయిదా పడింది. డైరెక్టర్ సుకుమార్ వల్లే ఈ చిత్రం ఆలస్యమవుతోందని సమాచారం బయటికి వచ్చింది. 2021లో వచ్చి బ్లాక్‍బస్టర్ అయిన పుష్పకు సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2పై పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అన్ని విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటూ, రీషూట్లు చేస్తూ డైరెక్టర్ లేట్ చేస్తున్నారని రూమర్లు ఉన్నాయి. ఈ విషయంపైనే అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశారనే ఊహాగానాలు వచ్చాయి.అయితే, మూవీ టీమ్ ఇచ్చిన తాజా అప్‍డేట్‍తో ఆ రూమర్లలో వాస్తవం లేదని తేలిపోయింది.షూటింగ్ అప్‍డేట్‍తో పాటు రిలీజ్ డేట్‍ను కూడా మళ్లీ చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక డిసెంబర్ 6న ఈ చిత్రం రావడం పక్కా అని నమ్మకం పెరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ ” డిసెంబరు 6న పుష్ష 2 రావడం ఫిక్స్. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం అంతే కాదు. ఒకరోజు ముందు, అంటే డిసెంబరు 5న ప్రీమియర్లు కూడా వేస్తున్నాం, సెప్టెంబరు 2 నాటికి ఫస్టాఫ్ ఎడిటింగ్ వెర్షన్ పూర్తి చేస్తామని, అక్టోబరు 6 కల్లా సెకండాఫ్ కూడా అయిపోతుంది, నవంబరు 20కి కాపీ పూర్తవుతుంది.

నవంబరు 25కి సెన్సార్ కూడా పూర్తి చేస్తాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పాటలు ఇవ్వాల్సి ఉంది.. అక్టోబరులో ఒకటి, నవంబరులో ఇంకో పాట విడుదల చేస్తాం" అని అన్నారు. మరోవైపు పుష్ప థియేట్రికల్ బిజినెస్ ఎవరు ఊహించని రేంజే లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఎవరు కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.ఇదిలావుండగా పుష్ప 2: ది రూల్ చిత్రంలో అల్లు అర్జున్‍కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు పాటలు ఐదు భాషల్లోనూ బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, జగదీశ్ ప్రతాప్ బండారీ, ప్రకాశ్ రాజ్, సునీల్, రావు రామేశ్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు.తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో పుష్ప 2 అప్డేట్ అడగడంతో రవి శంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వారానికి ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. నవంబర్ కి పూర్తి సినిమా మా చేతిలో పెడతారు. వినాయకచవితికి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమాలో ఇంకో రెండు పాటలు ఉన్నాయి. సెప్టెంబర్ చివర్లో ఒక సాంగ్, అక్టోబర్ లో ఒక సాంగ్ రిలీజ్ చేస్తాము. నవంబర్ 20 నుంచి ఫుల్ గా పుష్ప ప్రమోషన్స్ చేస్తాము. పుష్ప 2 ప్రీమియర్స్ కూడా ఉంటాయి అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: