టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి మొదటి రోజు భారీ కలెక్షన్లు వచ్చాయి.

కానీ ఈ మూవీ కి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో నిర్మాతలకు నష్టాలే వచ్చాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 29 వ తేదీన నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ విడుదల అయిన మొదటి రోజే వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న డబల్ ఇస్మార్ట్ మూవీ తో పోలిస్తే హిట్ టాక్ ను తెచ్చుకున్న సరిపోదా శనివారం సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ కలెక్షన్లు వచ్చాయి.

డబల్ ఇస్మార్ట్ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.10 కోట్ల కలెక్షన్లు రాగా , సరిపోతా శనివారం మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.88 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అలా ప్లాప్ టాక్ తో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డబల్ ఇస్మార్ట్ మూవీ భారీ కలెక్షన్లను వసూలు చేయగా , హిట్ టాక్ తో సరిపోదా శనివారం , డబుల్ స్మార్ట్ మూవీ కంటే తక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెండవ రోజు నుండి మాత్రం సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తూ బ్లాక్ బాస్టర్ వైపు దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: